Search

Translate English to Arabic Google-Translate-Chinese (Simplified) BETA Translate English to Arabic Translate English to Arabic Translate English to Croatian Translate English to Czech Translate English to danish Translate English to Dutch Translate English to Finnish Translate English to French Translate English to German Translate English to Greek Translate English to Hindi  Translate English to Italian Google-Translate-English to Japanese BETA Translate English to Korean BETA Translate English to Norwegian Translate English to Polish Translate English to Portuguese Translate English to Romanian Translate English to Russian Translate English to Russian BETA Translate English to Spanish

శరద్‌యాదవ్‌

Thursday


పేరు : శరద్‌యాదవ్‌

తండ్రిపేరు:నందిశోర్‌యాదవ్‌
తల్లిపేరు:శ్రీమతి సుమిత్రదేవి
పుట్టినతేది:02-07-1947
జన్మస్థలం:బాబయ్‌, హోసంగాబాద్‌జిల్లా (మధ్యప్రదేశ్‌ రాష్ట్రం)
వివాహం:5 ఫిబ్రవరి 1989
భార్యపేరు:డా.రేఖయాదవ్‌
పిల్లలు:ఒకబాబు, ఒక పాప
ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రం: బీహార్‌
పార్టీ:జనతాదళ్‌(యునైటెడ్‌)
ప్రస్తుత నివాసం:7 తుగ్లక్‌రోడ్‌, న్యూఢిల్లీ.
చదువు: బిఎస్‌సి,బిఇ(ఎలక్ట్రికల్‌), జబల్‌పూర్‌ యూనివర్సిటీ (మధ్యప్రదేశ్‌)
వృత్తి: రాజకీయనాయకుడు, సంఘసేవకుడు





రాజకీయాల్లో సీనియర్‌ నాయకునిగా, జనతాదళ్‌ (యునైటెడ్‌) అధ్యక్షునిగా అందరికీ సుపరిచితుడైన నాయకుడు శరద్‌యాదవ్‌.పూర్వజనతాదళ్‌ నుండి విడివడి ప్రత్యేక పార్టీ పెట్టుకొని కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నాయకుడిగా శరద్‌యాదవ్‌కు పేరుంది. బిసివర్గం నుంచి వచ్చిన నేతగా ఆయనకు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ చాలామంది మిత్రులున్నారు.ఇటీవల మహిళాబిల్లు విషయంలో ఆయన అన్న మాటలను మీడియా పతాక శీర్షికలకెక్కించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలు పక్కన పెడితే క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఆయనకు అన్ని పార్టీల్లోనూ మంచి గౌరవం ఉంది. శరద్‌యాదవ్‌ రాజకీయజీవితం గురించి ఈవారం ...

ఇప్పటివరకు పొందిన పదవులు: 1979లో ఐదవలోక్‌సభ సభ్యుడు, 1986లో అరవలో్‌ సభ, 1989- 91వరకు రాజ్యసభ సభ్యు డు,1990లో కేంద్రజౌళి మౌళిక పరిశ్రమల శాఖ మంత్రి,10,11,13,లోక్‌సభల్లోను సభ్యునిగాఉన్నారు.2001లో సివిల్‌ ఎవియె షన్‌ మంత్రిగా పనిచేశారు. 2002లో కార్మిక శాఖ మంత్రిగా, 2004లో ఆహార, ప్రజాపంపిణీ శాఖలో వినియోగదారుల హక్కుల మంత్రిగా పనిచేశారు.2004లో రాజ్యసభకు సభ్యునిగా ఎన్నికయ్యారు.2006లో పార్లమెంటరీ ఫోరం, జనభా, ప్రజా ఆరోగ్యం శాఖలను నిర్వహించారు.
ఇష్టాలు: క్లాసికల్‌మ్యూజిక్‌, హిస్టరీ, సాంస్రృతిక కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టం.
క్రీడలు: బాడ్మింటన్‌,ఇండియా హబిటెట్‌ సెంటర్‌ సభ్యులు, చారిత్రక విశేషాలు చదవడం, సైన్స్‌, జర్నల్స్‌ చదవడం.





ఆరాధించే నాయకులు

శరద్‌యాదవ్‌కు ప్రముఖ నాయకులైన మహత్మగాంధీ, రాంమనోహార్‌లోహియా, జయప్రకాశ్‌ నారాయణ్‌, చరణ్‌సింగ్‌,కర్పూరి టాగుర్‌ వారిని ఆరాధించడం అలవాటు వారి అడుగుజాడల్లో నడవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. వ్యక్తిగత జీవితంలోని వారి మాటలను అనుచరించడానికి ఎప్పుడు వెనుకడుగు వేయరు.


రాజకీయ జీవితం

1978లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శరత్‌యాదవ్‌ అప్పటినుండి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం కలగలేదు. తను పోటీ చేసిన ప్రతిసారి విజయం సాధించడంతో పాటు రాజకీయంగా బలపడ్డారు.ఆయన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌ అయినప్పటికీ బీహర్‌నుండి పోటీ వరుసగా విజయం సాధించడం విశేషం.హేమహేమీలున్న బీహర్‌ రాష్ట్రంలో శరద్‌ యాదవ్‌ది ప్రత్యేకస్థానం అనడంలో అతిశయోక్తిలేదు. ఆయన మొదటినుండి ముక్కుసూటితనంతో మాట్లాడడమే తెలుసు. ఏనాడు తన మాటను వెనుకకు తీసుకోలేని గుణం ఆయనది. రాజకీయంగా శాశ్వతమిత్రులు, శాశ్వతశత్రువులు ఉండరన్నది శరద్‌యాదవ్‌ విషయంలో అక్షరాల నిజం. తను మొదటినుండి వ్యవతిరేకించే కాంగ్రెస్‌పార్టీతో పొత్తుపెట్టుకుని మంత్రిపదవి సైతం చేజిక్కించుకున్న రాజకీయ చతురుడు శరద్‌యాదవ్‌.


స్ఫూర్తిదాయక నేతల అడుగుజాడల్లో...

శరద్‌యాదవ్‌ మంచి రాజకీయవేత్త...అంతకన్నా ముందు సమాజ సేవకుడు. చిన్నప్పటినుంచి అన్యాయాన్ని ఎదిరించే తత్వం ఆయనది. పాఠశాలలోనూ, కళాశాలలోనూ నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. మహాత్మాగాంధీ బోధనలు అంటే ఎంతో ఇష్టం. తర్వాత రామ్‌మనోహర్‌ లోహియాను తన మనసులోనే ఆరాధించుకుని ఆయనంటే ఎనలేని ఇష్టాన్ని పెంచుకున్నాడు.

దళిత ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా అహింసా పద్ధతులలో కొనసాగించి అహరహరం దళితుల బాగోగులకోసం పరితపించిన లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణకు ఏకలవ్య శిష్యుడు. జనతాపార్టీలో ఆయన సిద్ధాంతాలను శరద్‌ యాదవ్‌ తు.చ. తప్పక పాటించేవారు. ఇంకా వీరేగాక 28 రోజులు ప్రధానిగా చేసిన చరణ్‌సింగ్‌ అన్నా కూడా శరద్‌యాదవ్‌కు గౌరవం మెండుగా ఉండేది. ఆ తర్వాత కర్పూరీ ఠాకూర్‌...ఇలా కొందరు నేతల స్ఫూర్తిగా శరద్‌యాదవ్‌ రాజకీయ జీవితం కొనసాగింది. ఏ విషయాన్నయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. ఆయనకు అత్యంత సన్నిహితులు సైతం ఇదే విషయంలో ఆయనతో భేదాభిప్రాయలు వచ్చి పార్టీకి సైతం దూరం అయ్యారు. అయినా శరద్‌యాదవ్‌ తను నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆదర్శాల కోసం వ్యక్తిత్వాన్ని మాత్రం ఒదులుకోనంటారు.


మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు...

పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెల్పే తీర్మానంపై జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ మాట్లాడుతూ...వంద రోజుల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును సాధిస్తామని చెప్పిన రాష్టప్రతి వ్యాఖ్యలను నిర్మొహమాటంగా ఖండించారు. పైగా ఆ బిల్లును కనుక ఆమోదిస్తే తాను అక్కడే విషం తాగుతానని బెదిరిం చారు. శరద్‌యాదవ్‌ సంచలన ప్రకటన దేశం యావత్తూ నివ్వెర పోయేటట్లు చేసింది. అయితే ఈ విషయ ంలో తాను మహిళా బిల్లుకు వ్యతిరేకిని కానని... అంతకన్నా ముం దుగా బడుగు, వెనకబడిన వర్గాలకు చెందిన మిహ ళల సమస్యలు పరిష్కరిం చాలని పేర్కొన్నారు. పైగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మహి ళా బిల్లు ప్రవేశ పెట్టడం వెనక పెద్ద కుట్రే ఉన్నట్లు తాను భావిస్తున్నానన్నా రు. ఈ మహిళా బిల్లు చట్టసభలో కేవలం అగ్ర వర్ణ, ధనవంతులైన మహిళలకే ప్రాధాన్యత నిచ్చేదిలా ఉందని అన్నారు.


ప్రాంతీయ పార్టీలను ఎదగనీయకుండా చేయడమే ఇందులోని ఉద్దేశ్యమని తన అభిప్రాయాన్ని బాహాటంగా తెలిపారు. పైగా విషం తాగడం అనేది ఆత్మహత్య ఉద్దేశ్యం కాదని...తనకు నమ్మకం లేని విషయానికి మద్దతు తెల్పడం ఇష్టం లేక అలా విషం తీసుకుంటానని చెప్పానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ విషయంలో గ్రీక్‌ తత్వవేత్త సోక్రటీస్‌ను ఆదర్శంగా తీసుకున్నానని...ఆయన కూడా తన సిద్ధాంతాన్ని ఎవరూ నమ్మలేదని విషం తీసుకున్నారని ఉదహరించారు. అయితే 1990 సంవత్సరంలోనే మహిళాబిల్లు తెరపైకి వచ్చిందని అప్పటినుంచి ఈ బిల్లుకు అన్నీ అవరోధాలే ఎదురౌతున్నాయని...అందుకు సామాజిక న్యాయం పాటించకపోవడమేనన్నారు.





0 comments:

About Me

తెలుగులొ వ్రాయటం మట్లాడం ద్వారా తెలుగు భాషని విశ్వ వ్యాప్తం చెయలనే నా ప్రయత్నం సఃహకరించ గలరని మనవి

Archives